
మలేషియాలో అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన మహతీర్ మహమ్మద్ భార్య, డాక్టర్ సితి హస్మాహ్ మహమ్మద్ అలీ సోమవారం 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
అనారోగ్య సమస్యలతో కౌలాలంపూర్లోని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 28 ఉదయం 9:20 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.
సితి హస్మాహ్ మృతి పట్ల ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం సంతాపం వ్యక్తం చేశారు, ఆమెకు పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.