హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం సుమారు 2,200 మంది పోలీసులతో పాటు 408 సీసీటీవీ కెమెరాలు, రెండు డ్రోన్లతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రేక్షకుల కోసం ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులను నడపనుండగా మెట్రో రైలు సేవలను అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు.