
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం అరకులోయలోని గన్నెలలో గిరిజనుల కోసం 'సంజీవని' ఆరోగ్య ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు.
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాల కోసం రూ.250 కోట్లతో 'ట్రైబల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్'ను ప్రభుత్వం తీసుకువస్తోంది.
రాబోయే మూడేళ్లలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి లక్ష మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.