
నిజాంసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఈ పనుల్లో జాప్యం జరగడంతో ఇక్కడ విద్యుదుత్పత్తి పూర్తిగా పడకేసింది.
దీనివల్ల ఏటా 30 మిలియన్ యూనిట్ల చొప్పున నాలుగేళ్లలో మొత్తం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి నష్టపోయినట్లు అయింది.