
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు జరగనున్న తరుణంలో, సెప్టెంబర్ 22న భారత్తో జపాన్ తొలిసారి టీ20 మ్యాచ్ ఆడనుంది.
జపాన్లో క్రికెట్ విస్తరణ, భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు.
ఈ మ్యాచ్కు సంబంధించి ఇప్పటికే అన్ని టికెట్లు అమ్ముడైపోగా, తమ సత్తా నిరూపించుకుంటామని జపాన్ కెప్టెన్ కెండెల్ ఫ్లెమింగ్ తెలిపారు.