
న్యూయార్క్‌లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడికి సంబంధించిన 1.73 లక్షల పేజీల రికార్డులను నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఆన్లైన్లో విడుదల చేశారు.
2001 సెప్టెంబరు 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిలో 2,977 మంది మరణించగా, అనంతరం అనారోగ్య సమస్యలతో మరో 9,400 మంది ప్రాణాలు కోల్పోయారు.
విషవాయువులు వ్యాపించినట్టు అధికార యంత్రాంగానికి ముందే తెలుసని, అయితే పరిహార బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు వాటిని తక్కువ చేసి చూపించారని మేయర్ తెలిపారు.