
మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 20 శాతం కోత విధిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.
ఈ కోత విధించిన మొత్తాన్ని మొదటి భార్య బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని, దీని కోసం బాధితురాలు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించాలని తెలిపారు.
విడాకుల కేసు కోర్టులో ఉన్నప్పటికీ, చట్టాన్ని ఉల్లంఘించే ఉద్యోగులపై సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆగస్టు 15న సీఎం స్పష్టం చేశారు.
skip