
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖ నుంచి చేపట్టిన పర్యటనలో భారీగా జనం పోటెత్తారు.
విశాఖ ఎయిర్పోర్టు నుంచి అంపోలు జైలు వరకు 120 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి సుమారు ఆరున్నర గంటల సమయం పట్టిందని, దారి పొడవునా వేలాది మంది అభిమానులు తరలివచ్చారని సమాచారం.
పోలీసుల ఆంక్షలు, బారికేడ్లను అధిగమించి జగన్ను కలిసిన ఉద్యోగులు, రైతులు, మత్స్యకారులు తమ సమస్యలను విన్నవించగా, ఆయన జైలు వద్ద అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.