
మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో జరిగిన ఘోర ప్రమాదంలో బంగారు గని కూలిపోవడంతో దాదాపు 30 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
గని కూలిన సమయంలో లోపల ఉన్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.