
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షై హోప్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ 2026-27 సీజన్ కోసం హోబర్ట్ హరికేన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ నేపథ్యంలో హరికేన్స్ జట్టుకు ఎంపికైన తొలి విదేశీ పురుషుల ఆటగాడిగా హోప్ నిలిచాడు.
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 12 పరుగులు చేసినప్పటికీ, వన్డేల్లో భారత్‌పై 1,000 పరుగులు పూర్తి చేసిన 9వ విండీస్ బ్యాటర్‌గా అతను అరుదైన రికార్డు సాధించాడు.