
టాటా సన్స్‌ను అప్పర్ లేయర్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా వర్గీకరించడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమర్థించారు.
టాటా సన్స్ వంటి భారీ ఎన్బీఎఫ్సీలు విధిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నియంత్రణ నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వర్గాలు తేల్చిచెప్పాయి.