
శివాజీ ప్రధాన పాత్రలో బాలాజీ వీఆర్ దర్శకత్వంలో 'ఎమ్ 3' వర్కింగ్ టైటిల్తో ఒక కొత్త చిత్రం తెరకెక్కుతోంది.
సుమారు 72 రోజుల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.