
హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (HNI) కేవలం మూడు నెలల్లోనే రూ.1.83 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో, వారి మొత్తం ఈక్విటీ హోల్డింగ్ విలువ రూ.9.92 లక్షల కోట్లకు చేరింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీ మరియు ఇన్ఫోసిస్ షేర్లలో సంపన్నులు భారీగా పెట్టుబడులు పెట్టారు.
భారత స్టాక్ మార్కెట్ విలువలో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 15.88 శాతానికి పడిపోగా, దేశీయ ఇన్వెస్టర్ల వాటా 28.66 శాతంతో ఆల్-టైమ్ రికార్డును నమోదు చేసింది.