
జార్ఖండ్ రాష్ట్రంలోని సిమ్డేగా జిల్లాలో 10 ఏళ్ల బాలికలో రుబెల్లా వైరస్ను వైద్యులు గుర్తించారు.
సెప్టెంబర్ 22న ఈ తొలి కేసు వెలుగులోకి రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమై నిఘాను తీవ్రం చేసింది.
ఈ వైరస్ సోకిన పిల్లల్లో ముఖంపై ప్రారంభమై శరీరమంతా ఎర్రటి దద్దుర్లు రావడం ప్రధాన లక్షణమని వైద్యులు తెలిపారు.