
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ గురించి శ్రీలంక మాజీ బౌలర్ నువాన్ కులశేఖర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆ మ్యాచ్ తర్వాత ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడినా, ధోనీ ఎప్పుడూ ఆ సిక్స్ గురించి తనతో ప్రస్తావించలేదని కులశేఖర తెలిపారు.
గతాన్ని పట్టించుకోకుండా వర్తమానంపై దృష్టి పెట్టే ధోనీ వ్యక్తిత్వం తనకు ఎంతో నచ్చుతుందని ఆయన ప్రశంసించారు.