
శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మార్చాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటి వరకు లోతుకుంటా భూముల జోలికి వెళ్లవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.
రంగనాథ్ తరఫున హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించగా, డివిజన్ బెంచ్ ఈ తాత్కాలిక ఉపశమనం కల్పించింది.