
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కాళీఘాట్లోని ఆమె నివాసం ముందే కత్తితో దాడికి యత్నం జరిగింది.
వాలంటీర్ వేషంలో వచ్చిన తనిస్థా సాహా అనే మహిళ ఈ దాడికి పాల్పడగా, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
నిందితురాలు డ్రగ్స్కు బానిస అని, మత్తులోనే ఈ యత్నానికి పాల్పడిందని టీఎంసీ నేతలు తెలిపారు.