
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నిజామాబాద్లో మాట్లాడుతూ, తనను తిహాడ్ జైలుకు పంపడంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.
తండ్రిని, బిడ్డను వేరు చేయడంలో ప్రశాంత్ రెడ్డి మొదటి పాత్ర పోషించారని ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తాను ఎటువంటి తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, ప్రశాంత్ రెడ్డికి తన ఉసురు తగులుతుందని కవిత హెచ్చరించారు.