
గతేడాది నవంబర్ 2న ప్రయోగించిన ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌కు చెందిన సీ25 అప్పర్ స్టేజ్ జూలై 30న భూ వాతావరణంలోకి ప్రవేశించి ధ్వంసమైంది.
అంతరిక్ష వ్యర్థాలను తగ్గించేందుకు ఇస్రో చేపట్టిన పాసివేషన్ ప్రక్రియ ద్వారా ఈ రాకెట్ భాగాన్ని 21 డిగ్రీల ఇక్లినేషన్‌లో కక్ష్యలో ఉంచారు.
ఈ స్టేజ్ అట్లాంటిక్ మహాసముద్రంపై పడుతుందని అంచనా వేసిన శాస్త్రవేత్తలు, వాతావరణంలోకి ప్రవేశించే సమయాన్ని సాయంత్రం 5 గంటల 38 నిమిషాలుగా నిర్ధారించారు.