నాగపట్టినం జిల్లా విళుందమావడి గ్రామంలో పెళ్లికాని యువకులు మద్యం సేవిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ప్రకటించారు.
ఆగస్టు 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం, పెళ్లయిన వారు కూడా బహిరంగంగా గొడవలకు దిగితే రూ. 5,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో 5,000 కుటుంబాలు నివసించే ఈ గ్రామంలో మద్యం రహిత వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.