వెల్మల్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు నమోదవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
దోమల నివారణకు ఫాగింగ్ చేయడంతో పాటు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.