హైదరాబాద్లోని చిన్నారుల్లో కీళ్ల నొప్పులు, అలసట, కండరాల బలహీనత వంటి సమస్యలకు విటమిన్-డి లోపమే ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు.
నగరంలోని 60 నుంచి 70 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
పిల్లలు ఆరుబయట ఆటలకు దూరంగా ఉంటూ మొబైళ్లు, టీవీలకు అతుక్కుపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని, ప్రతిరోజూ 30-45 నిమిషాలు ఎండలో ఆడుకునేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.