
వాయవ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్పష్టమైన అల్పపీడనంగా బలపడి కొనసాగుతోంది.
ఈ వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.