
ఐదేళ్ల పాటు సివిల్స్ కోసం శ్రమించి, మూడుసార్లు మెయిన్స్ వరకు వెళ్లిన ఒక అభ్యర్థి, ఈసారి ప్రిలిమ్స్‌లో విఫలమవడంతో తన పుస్తకాలను కబాడీవాలాకు విక్రయించాడు.
ఆ పుస్తకాల తూకం ద్వారా వచ్చిన రూ. 464ను దేవుడి హుండీలో వేసి, తన సివిల్స్ ప్రయాణానికి శాశ్వతంగా స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు.
ఉద్యోగ ఆఫర్లను వదులుకుని, వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ విజయం దక్కకపోవడంపై ఆ యువకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.