
అక్టోబరు 15 నాటికి దేశంలో రూ.43.46 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తెలిపింది.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే చలామణిలో ఉన్న కరెన్సీ 13.5 శాతం పెరిగిందని, ఇది గత ఐదేళ్లలో గరిష్ఠమని పేర్కొంది.
ప్రవాస భారతీయుల ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) డిపాజిట్ల కారణంగా ఆర్‌బీఐ వద్ద రిజర్వ్ మనీ రికార్డు స్థాయిలో రూ.53.24 లక్షల కోట్లకు చేరింది.