
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీలు రాబోయే నాలుగు నుంచి ఐదు నెలల్లో రీఛార్జ్ ధరలను పెంచడానికి సన్నద్ధమవుతున్నాయి.
సెంట్సమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, రీఛార్జ్ ధరలు 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే దీనిపై టెలికాం సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.