
భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన వీడియోలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపడం వివాదాస్పదమైంది.
ఈ మ్యాప్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
సెప్టెంబర్ 13 నుంచి దిల్లీ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.