
ఇంజినీర్లను 'క్రిమినల్ వేస్ట్' అని సంబోధించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు.
దేశ ప్రగతికి పాటుపడుతున్న ఇంజినీర్లను అవమానించడం కాంగ్రెస్ విధానమేనా అని ప్రశ్నించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని, ఈ అంశంపై రాహుల్ గాంధీ మౌనం వహించడం సరికాదని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.