
మహిళల ఆసియాకప్-2026లో భాగంగా సెప్టెంబర్ 10న దుబాయ్లో జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్తో బంగ్లాదేశ్ తలపడనుంది.
మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో యూఏఈని ఓడించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 103 పరుగులు చేయగా, యూఏఈ జట్టు బంగ్లా బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది.