
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని వివాదాస్పద 550 ఎకరాల పైచిలుకు భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ భూములపై హక్కులు కోరుతూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం కొట్టివేసింది.
గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను తోసిపుచ్చడంతో దశాబ్దాల కాలంగా నడుస్తున్న న్యాయ వివాదానికి తెరపడింది.