
పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో మాజీ ఆర్టీసీ బస్సు డ్రైవర్ మినార్ మోండల్ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో రూ. 28.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారం లభ్యమయ్యాయి.
సుమారు 15 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో మినార్ మోండల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉందని, తులు మోండల్‌తో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.