
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదిన అభిషేక్, కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీని సాధించాడు.
గతంలో శుభ్‌మన్ గిల్ (126), రుతురాజ్ గైక్వాడ్ (123) పేరిట ఉన్న రికార్డులను అభిషేక్ శర్మ అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.