
కెనడాలో నివసిస్తున్న 31 ఏళ్ల సాఫ్ట్వేర్ డెవలపర్ అక్షయ్ సప్రా, ట్రేడింగ్ వ్యసనం వల్ల స్పేస్ ఎక్స్ షేర్లలోనే రూ. 2 కోట్ల వరకు నష్టపోయాడు.
తక్కువ కాలంలోనే ట్రేడింగ్‌కు బానిసైన సప్రా, ఉద్యోగం మానేసి ఉబెర్ డ్రైవింగ్ చేస్తూ అప్పులు చేసి మరీ క్రిప్టో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు.
మూడు వారాల రిహాబ్ సెంటర్‌కు వెళ్లినా ఫలితం లేకపోవడంతో, ప్రస్తుతం తన ట్రేడింగ్ అనుభవాలను యూట్యూబ్ ఛానెల్ ద్వారా రికార్డ్ చేస్తున్నాడు.