
యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా లండన్లోని హీత్రూ, స్టాన్స్టెడ్ సహా మాంచెస్టర్, బర్మింగ్హామ్ విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది.
ఈ సాంకేతిక లోపం వల్ల దాదాపు 300 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
ప్రధాన విమానాశ్రయాల్లోని ఏటీసీ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.