
బంగ్లాదేశ్‌లోని ఛత్తోగ్రామ్ హథాజారీ ఫైరింగ్ రేంజ్లో బుధవారం జరిగిన శిక్షణలో చైనా తయారీ టైప్-59 యుద్ధ ట్యాంకు పేలి ఇద్దరు సైనికులు మరణించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ఒక ఆర్మీ అధికారికి ఢాకాలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
1972లో బంగ్లాదేశ్ ఆర్మీలో ప్రవేశపెట్టిన ఈ ట్యాంకులు ప్రస్తుతం 174 సంఖ్యలో ఉండగా, తాజా ఘటనపై ఆర్మీ దర్యాప్తునకు ఆదేశించింది.