
అల్లరి నరేష్ హీరోగా నటించిన 'రంభ ఊర్వశి మేనక' సినిమా టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాలో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించగా, వెన్నెల కిషోర్ దేవేంద్రుడి పాత్రలో కనిపించనున్నారు.