
అమెరికా–చైనా మధ్య ఏఐ చిప్స్ పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హాంగ్, ఆలిస్ హాంగ్ అనే మహిళతో సంబంధాలు నెరపడంపై అమెరికా నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
సింగపూర్‎కు చెందిన డేటా సెంటర్ మెగాస్పీడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ఆలిస్.. చైనా తరఫున అమెరికా ఏఐ సాంకేతిక రహస్యాలు సేకరించేందుకు, ఎన్విడియా ప్రాసెసర్లను చైనాకు చేరవేసేందుకు పనిచేసినట్లు అనుమానిస్తున్నారు.
ఆమె ద్వారా ఎన్విడియా చిప్‌లు చైనాలోని అలీబాబా వంటి సంస్థలకు అందుబాటులోకి వచ్చాయని, ఎన్విడియా- గిగాబైట్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లతోనూ ఆమె సంబంధాలు నడిపారని నివేదిక పేర్కొన్నప్పటికీ ఎన్విడియా ఈ వార్తలను ఖండించింది.