
భారతదేశంలో నగరవాసుల్లో 70 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని, ముఖ్యంగా మహిళలు, గర్భిణీలు, డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
విటమిన్ డి ఉత్పత్తికి అవసరమైన 'యువిబి' కిరణాలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎక్కువగా లభిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
అలసట, కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవాలని, ఆహారంలో గుడ్లు, చేపలు చేర్చుకోవాలని నిపుణులు పేర్కొన్నారు.