International
సౌదీ వారించినా హూతీలపై దాడులకు ఇజ్రాయెల్ సిద్దం

సౌదీ వారించినా హూతీలపై దాడులకు ఇజ్రాయెల్ సిద్దం

Andhrajyothy1h
THE BRIEF
1

సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఉత్సుకత చూపుతున్న ఇజ్రాయెల్, హూతీలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

2

సౌదీ భూభాగంపై హూతీల డ్రోన్, మిసైల్ దాడులు పెరుగుతుండగా, నిఘా సమాచారం పంచుకోవడంతో పాటు సేనలను పంపేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సిద్ధపడ్డారు.

3

అయితే ఇజ్రాయెల్ సేనలను దించితే దేశ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ సాయం తీసుకునేందుకు సందేహిస్తున్నారు.