
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లో నిన్న ఒక్కసారిగా పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల అక్రమ భవనాన్ని అధికారులు బాహుబలి క్రేన్‌తో కూల్చివేశేశారు.
అనుమతులు లేకుండా నిర్మించిన ఈ భవనం పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురికాగా, ప్రమాదం జరగకుండా చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు.
అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం మొత్తం 13 అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు.