
పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు తన కుటుంబంతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో, కాకినాడకు చెందిన షేక్ సాదిక్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుడి వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు 103(1), 306(50), 127(1), 351(3), 108, 299 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జూలై 2న మరణించిన నూకరాజు కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి మృతిలో సాదిక్ ఖాన్ ప్రమేయం ఉందని, తన కోడలు సౌజన్యను ఆస్తి కోసం అతను వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.