
అమెరికాలోని ఒహాయోలో మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తి కింద పడిపోయినప్పుడు, అతని యాపిల్ వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సేవలను అప్రమత్తం చేసింది.
వాచ్ పంపిన లొకేషన్ ఆధారంగా వైద్యులు చేరుకుని, అతని ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించి ప్రాణాలు కాపాడారు.
యూజర్ కదలకుండా ఉన్నప్పుడు 30 సెకన్ల కౌంట్‌డౌన్ తర్వాత ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసేలా ఈ ఫీచర్ రూపొందించబడింది.