
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు నెట్స్ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించారు.
ట్రైనింగ్ సెషన్‌లో భాగంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఉన్న బలహీనతను అధిగమించడంపై గిల్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోగా, కెప్టెన్ గిల్ మాత్రం తన ఆటను మెరుగుపరుచుకోవడానికి మైదానంలో చెమటోడ్చారు.