
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ అనుబంధ సంస్థ ‘హైపర్ వాల్ట్’ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
రూ. 70 వేల కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7 వేల మందికి ఉపాధి లభించనుందని, దీనిని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గడువు విధించారు.
ఫ్యూచర్ సిటీకి వెళ్లే 50 కిలోమీటర్ల రేడియల్ రోడ్డుకు భారతరత్న రతన్ టాటా పేరు పెడతామని, స్థానిక యువత కోసం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.