
ఇంటి ఆవరణలో నిలిచిన నీరు, గుబురు పొదలు, తీగ మొక్కలు పాములకు అనుకూల ఆవాసాలుగా మారుతాయి.
పక్షుల కోసం వేసే గింజలు ఎలుకలను ఆకర్షిస్తాయి, తద్వారా వాటిని వేటాడేందుకు పాములు కూడా ఇంటి పరిసరాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది.
పాము కాటుకు గురైతే నాటు వైద్యం జోలికి వెళ్లకుండా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.