
ఉద్యోగుల హక్కుల సాధన కోసం తాము చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ఎజెండాగా అభివర్ణించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలను ఏపీ ఐకాస ఖండించింది.
ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఈ మేరకు మంత్రి వ్యాఖ్యలపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.