
మదనపల్లెలో లేడీ డాన్‌గా పేరొందిన కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించి 50 ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
వైకాపా హయాంలో 15 ఫోర్జరీ సంతకాలు చేసిన ఖాళీ బాండ్లను ఉపయోగించి రూ.కోట్ల విలువైన భూములను ఆక్రమించినట్లు దర్యాప్తులో తేలింది.
సులోచనపై ఇప్పటికే 14 క్రిమినల్ కేసులు, రౌడీషీట్ ఉన్నాయని, ఆమెపై వచ్చిన భూ కబ్జా ఫిర్యాదు మేరకు కోర్టు వారెంట్‌తో ఈ దాడులు జరిగాయని డీఎస్పీ తెలిపారు.