అమెరికా నావికాదళం దిగ్బంధనం మరియు కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ రహస్యంగా సైనిక పరికరాలు దిగుమతి చేసుకుంటోందని రాయిటర్స్ నివేదించింది.
జనవరి 2025 నుంచి దాదాపు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,000 కోట్లు) యుద్ధ సామాగ్రి కొనుగోలు కోసం 'MOD' పేరుతో 5,000 పైగా రహస్య ఏజెన్సీల నెట్వర్క్ను ఇరాన్ ఏర్పాటు చేసింది.
కరెన్సీ మార్పిడి లేకుండా జరిగిన ఈ లావాదేవీల ద్వారా చైనా, రష్యా నుంచి రాకెట్ ఇంధనాలు, పేలుడు పదార్థాలు, ట్రక్కులను టెహ్రాన్ రక్షణ శాఖ దిగుమతి చేసుకుంది.