
నిజామాబాద్ నగరంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా శేషాల నరేశ్(33), మేఘన(30) అనే దంపతులు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు.
గతేడాది రూ.90 లక్షలతో ఇల్లు కొనుగోలు చేసిన నరేశ్, అప్పుల భారం పెరగడంతో ఇంటిని అమ్మేసి, తీవ్ర మానసిక ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
నరేశ్ ఇంట్లో ఉరి వేసుకోగా, భార్య మేఘన పురుగుల మందు తాగి మరణించిందని, మృతురాలి తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.