
సుమారు 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల నమోదు వివరాలను చైనా లేదా దాని అనుబంధ సైబర్ వర్గాలు సేకరించాయని వైట్‌హౌస్ సంచలన ఆరోపణలు చేసింది.
ప్రభుత్వ పారదర్శకత టాస్క్‌ఫోర్స్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం, ఈ సమాచారాన్ని హ్యాకింగ్, చోరీ లేదా కొనుగోలు ద్వారా సేకరించినట్లు నిఘా సంస్థలు ధృవీకరించాయి.
ఈ డేటా వినియోగంతో ఎన్నికల ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం లేదా ఓటర్లను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి.